తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్​ను ఉత్తమ్ నాశనం చేశారు: మాజీ మంత్రి చంద్రశేఖర్ - ex minster chandra shaker comments on utham kumar reddy news

తెలంగాణలో కాంగ్రెస్​కు​ మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చంద్రశేఖర్.. భాజపాలో చేరడానికి ముహూర్తం ఖరారైంది. పార్టీలో ఆరేళ్లుగా కొనసాగినా.. వికారాబాద్​లో పోటీ చేసే అవకాశం రాలేదని ఆవేదన చెందారు. కాంగ్రెస్​ను ఉత్తమ్​కుమార్ రెడ్డి నాశనం చేశారని విమర్శించారు.

Congress was best destroyed: Ex Minster chandra shaker
కాంగ్రెస్​ను ఉత్తమ్ నాశనం చేశారు: మాజీ మంత్రి చంద్రశేఖర్

By

Published : Dec 16, 2020, 9:51 PM IST

మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చంద్రశేఖర్.. భాజపా తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం ఖరారైంది. భాజపాలో ఈనెల 28న చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చంద్రశేఖర్ వెల్లడించారు. పార్టీలో ఆరేళ్లుగా కొనసాగుతున్నప్పటికీ.. వికారాబాద్​లో పోటీ చేసే అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ను ఉత్తమ్​ కుమార్ రెడ్డి నాశనం చేశారని విమర్శించారు.

కాంగ్రెస్​ను జీరో చేశారు...

ఉత్తమ్​ భార్య ఓడిపోయినా ఆయన నైతిక బాధ్యత వహించలేదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ను జీరో చేసి రాజీనామా చేశారని మండిపడ్డారు. ఎన్నికల్లో పార్టీల గుర్తులు బలంగా పనిచేస్తాయని.. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తర్వాత ఆ విషయం తెలిసిందన్నారు. తనకు నాగర్ కర్నూల్ టికెట్ రాకుండా మంత్రి సబితా రెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రస్తుతం ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. భాజపాలో కలిసి పనిచేద్దామని డీకే అరుణ నన్ను కోరారు. భాజపాలోకొచ్చిన తర్వాత షరతులు పెడితే ఒప్పుకోను. కాంగ్రెస్​లో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత లేదు. ఒకే వర్గానికే ప్రాధాన్యత ఉంది. - మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ఏ.చంద్రశేఖర్

విడదీసి అన్యాయం చేశారు...

భాజపా జాతీయ పార్టీ అయినప్పటికీ రాష్ట్రంలో ఒక బీసీ నాయకుడైన.. బండి సంజయ్​ని పార్టీ అధ్యక్షుడిగా నియమించిందన్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్​ను విడదీసి అన్యాయం చేశారని ఆరోపించారు.

వచ్చే ఎన్నికల్లో భాజపా తరపున వికారాబాద్​లో పోటీ చేసి.. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్​ మాదిరి అభివృద్ధి చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భాజపా పాలనను జనం కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని మాజీ మంత్రి చంద్రశేఖర్ ప్రకటించారు.

ఇదీ చూడండి:ధరణి సమస్యలను పరిష్కరిస్తామన్నారు: ట్రెసా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details