తెలంగాణ

telangana

ETV Bharat / state

డీసీసీ ఆధ్వర్యంలో 300 కుటుంబాలకు సరకుల పంపిణీ - DCC PRESIDENT RAM MOHAN REDDY

పేదలెవరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో డీసీసీ ఆధ్వర్యంలో నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 300 మంది కుటుంబాలకు డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి సరకులు అందజేశారు.

వికారాబాద్ డీసీసీ ఆధ్వర్యంలో సరకుల పంపిణీ
వికారాబాద్ డీసీసీ ఆధ్వర్యంలో సరకుల పంపిణీ

By

Published : Apr 20, 2020, 10:32 AM IST

వికారాబాద్ జిల్లా పరిగిలో వలస కూలీలు, పేద ప్రజలకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో 300 కుటుంబాలకు 12 రకాల నిత్యావసర వస్తువులు అందజేశారు. పేద ప్రజలు, వలస కూలీలు ఆకలితో అలమటించకూడదని ఈ వితరణ చేసినట్లు డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన కూలీలకు ఎస్​ఆర్ఆర్ ఫార్చూన్ ఇన్ఫ్రా సంస్థ సహాకారంతో ఈ కార్యక్రమం నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. పేద ప్రజలకు చేతనైన సాయం చేద్దామనే ఉద్దేశంతో డీసీసీతో కలిసి సరకుల పంపిణీ నిర్వహించామని సంస్థ ఎండీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. విపత్కర సమయాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేందుకు దాతలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని ఆయన కోరారు.

ABOUT THE AUTHOR

...view details