తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యాసంస్థలను త్వరలోనే పునఃప్రారంభిస్తాం: సబితా

కరోనా కారణంగా మూతపడిన విద్యాసంస్థలను త్వరలోనే పునఃప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమైన 7 రాష్ట్రాల్లోని పరిస్థితులను ప్రభుత్వం పరిశీలిస్తోందని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో కోటి రూపాయల నిధులతో నిర్మించనున్న నూతన రీడింగ్ రూమ్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

education institutions will open soon: sabitha indra reddy
విద్యాసంస్థలను త్వరలోనే పునఃప్రారంభిస్తాం: సబితా

By

Published : Dec 15, 2020, 9:53 PM IST

రాష్ట్రంలో త్వరలో పాఠశాలలు తెరుచుకునే అవకాశం ఉంది. కరోనా కారణంగా మూతపడిన విద్యాసంస్థలను త్వరలోనే పునఃప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమైన 7 రాష్ట్రాల్లోని పరిస్థితులను ప్రభుత్వం పరిశీలిస్తోందని పేర్కొన్న మంత్రి... విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం త్వరలోనే నిర్ణయాన్ని వెల్లడిస్తుందన్నారు.

వికారాబాద్ జిల్లా కేంద్రంలో కోటి రూపాయల నిధులతో నిర్మించనున్న నూతన రీడింగ్ రూమ్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మెతుకు ఆనంద్, విద్యా మౌలిక సదుపాయాల కల్పన ఛైర్మన్ నాగేందర్ గౌడ్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:రేపు దిల్లీ వెళ్లనున్న ఎంపీ రేవంత్​ రెడ్డి.. పీసీసీ కోసమేనా?

ABOUT THE AUTHOR

...view details