వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర సరకులను పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. అహర్నిశలు రోడ్లపై గస్తీ కాస్తోన్న పోలీసుల కృషిని ఆయన కొనియాడారు. ఎవరికైనా కరోనా వైరస్ సోకిందని తెలిస్తేనే గ్రామాల్లోకి రానివ్వమని... అలాంటిది కార్మికులు రోగులకు దగ్గర ఉండి సేవ చేస్తున్నారని ఎమ్మెల్యే కీర్తించారు. అలాంటి వారికి సరకుల రూపేణ సాయం అందించడం మన అదృష్టమని అన్నారు.
ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులకు సరకుల పంపిణీ - కిరాణా సామగ్రి
వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కిరాణా సామగ్రి అందించారు. ఆశా వర్కర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు సరకులను పంపిణీ చేశారు.
కుల్కచర్లలో కిరాణా సామగ్రి పంపిణీ
పోలీసులు, వైద్యులు, ఆశా వర్కర్లు చేస్తోన్న సేవలు మరువలేనివి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.