వికారాబాద్ జిల్లా పరిగిలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ఆధ్వర్యంలో 1500 పేద కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని పేదలకు కూరగాయలు, సరుకులు అందించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాలతో ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా సరుకులు పంపిణీ చేస్తున్నట్లు రామ్మోహన్ రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్ వల్ల పేదలకు జీవనోపాధి లభించక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని... వారికి సహాయపడాలనే నిత్యావసరాలు, కూరగాయలను పంపిణీ చేస్తున్నామన్నారు.
పరిగిలో డీసీసీ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ - పరిగి నిత్యావసరాలు పంపిణీ
వికారాబాద్ జిల్లా పరిగిలో డీసీసీ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని సుమారు 1500 కుటుంబాలకు కూరగాయలు, సరుకులు అందజేశారు.

నిత్యావసరాలు పంపిణీ