కులకచర్లలో బతుకమ్మ చీరల పంపిణీ
మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీతో అతివలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఎంపీపీ సత్య హరిచంద్ర అన్నారు. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సౌమ్య వెంకట్రామిరెడ్డి, జడ్పీటీసీ రామదాస్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.