వికారాబాద్ జిల్లా కొడంగల్ డీసీఎంఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో జరుగుతున్న సర్వసభ్య సమావేశం వద్దకు వెళ్లి ధర్నా చేపట్టారు. కందుల కొనుగోలు వ్యవహారంలో మోసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రజాసంఘాల నాయకులు బీఎల్ఎఫ్ పార్టీ నాయకులు, కార్మిక సంఘాల నాయకులు శనివారం కొడంగల్ పట్టణంలో డిమాండ్ చేశారు.
కందుల కొనుగోలులో మోసగాళ్లను అరెస్ట్ చేయాలంటూ ధర్నా - Dharna calls for arrest of fraudsters in Lentils procurement at kodangal
డీసీఎంఎస్ వ్యవహారంలో జరిగిన రూ. 73 లక్షల అవినీతిని బయటపెట్టి నేరం చేసిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు. కొడంగల్ పట్టణంలో జరుగుతున్న మండల సర్వసభ్య సమావేశానికి ప్రజాసంఘాల నాయకులు వచ్చి ధర్నాకు దిగారు.
![కందుల కొనుగోలులో మోసగాళ్లను అరెస్ట్ చేయాలంటూ ధర్నా Dharna calls for arrest of fraudsters in Lentils procurement at kodangal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8776616-724-8776616-1599916543959.jpg)
కందుల కొనుగోలులో మోసగాళ్లను అరెస్ట్ చేయాలంటూ ధర్నా
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, ఎంపీపీ.. అక్కడకు చేరుకుని వారితో మాట్లాడారు. కందుల కొనుగోలు వ్యవహారంలో జరిగిన అవకతవకల గురించి మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. దీనిపై విచారణ జరుగుతోందని.. నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ప్రజాసంఘాల నాయకులకు ఎమ్మెల్యే తెలిపారు. దోషులపై కేసు పెడతామని చెప్పగా ప్రజా సంఘాల నాయకులు ధర్నాను విరమించారు.