తెలంగాణ

telangana

ETV Bharat / state

బావిలో పడిన జింక.. సురక్షితంగా కాపాడిన అధికారులు - వికారాబాద్​ జిల్లా తాజా వార్తలు

వికారాబాద్​ జిల్లాలో ప్రమాదవశాత్తు బావిలో పడిన జింకను అటవీ అధికారులు కాపాడి... అడవిలో వదిలారు. మేత కోసం వచ్చి బావిలో పడినట్లు వ్యవసాయ క్షేత్రం యజమాని తెలిపారు.

Deer that fell in the well .. Officers rescued safely in vikarabad
బావిలో పడిన జింక.. సురక్షితంగా కాపాడిన అధికారులు

By

Published : Feb 20, 2021, 8:48 PM IST

బావిలో పడిన జింకను కాపాడిన ఘటన వికారాబాద్​ జిల్లాలో చోటు చేసుకుంది. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆలంపల్లిలో తెరాస నాయకుడు శుభప్రద్​​ పటేల్​కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో బావి ఉంది. అక్కడికి మేతకోసం వచ్చిన జింక ప్రమాదవశాత్తు బావిలో పడిందని ఆయన తెలిపారు.

ఇది గమనించి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు బావిలోని జింకను తాళ్ల సాయంతో బయటకు లాగారు. సురక్షితంగా తిరిగి అడవిలోకి వదిలినట్లు వారు వెల్లడించారు.

ఇదీ చదవండి: జూన్​ 12న పాలీసెట్​.. మే1- 22 వరకు దరఖాస్తుల స్వీకరణ

ABOUT THE AUTHOR

...view details