వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి పంటలు పూర్తిగా పాడయ్యాయి. చేతికొచ్చిన పంట నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పరిగి మండలంలోని జాఫర్ పల్లి, రాఘపూర్, మల్కపూర్ గ్రామాల్లోని పొలాలను డీసీసీ అధ్యక్షులు టి రామ్మోహన్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ కృష్ణ సందర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉండి... పంటలు పాడైతే వెంటనే నష్టపరిహారం అందించేదని రామ్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. సబ్సిడీ ద్వారా నేరుగా రైతుల ఖాతాలో జమ చేసేదని తెలిపారు.
'నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి' - dcc president t ram mohan ra0 about crop loses
ఎడతెరిపి లేకుండా కురిస్తున్న వానలతో పంటలు వర్షార్పణం అయ్యాయి. వరి, పత్తి పొలాలు నీట మునిగాయి. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో జలమయమైన పంటలను డీసీసీ అధ్యక్షులు టి.రామ్మోహన రావు, బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ కృష్ణ సందర్శించారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉందని గుర్తు చేశారు.
'నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి'
తెరాస ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందని అన్నారు. ఇప్పటికైనా వెంటనే స్పందించి నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలని కోరారు. ఎకరాకు రూ.20వేల నుంచి 30వేలు అందిచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:దేశవ్యాప్తంగా 73 లక్షలకు చేరిన కరోనా కేసులు