తెలంగాణ

telangana

ETV Bharat / state

తాండూరులో ఘనంగా విజయదశమి వేడుకలు - వికారాబాద్​లో దసరా ఉత్సవాలు

వికారాబాద్ జిల్లా తాండూరులో విజయదశమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఉత్సవాల్లో పాల్గొన్ని ఒకరికొకరు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

dasara festival celebrations at tandur in vikarabad district
తాండూర్​లో ఘనంగా విజయదశమి వేడుకలు

By

Published : Oct 25, 2020, 10:38 PM IST

వికారాబాద్​ జిల్లా పాత తాండూరులోని ​అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో ఎమ్మెల్సీ మహేందర్​రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్​రెడ్డి పాల్గొని జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మిని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

నియోజకవర్గంలోని మల్యాల, బషీరాబాద్, తాండూర్ మండలాల్లోని ప్రతి గ్రామంలోనూ దసరా పండుగ ఉత్సవాలు అంబరాన్నంటాయి. వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన రావణాసుర వధ కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఇదీ చూడండి:రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా విజయదశమి వేడుకలు.. కిటకిటలాడిన ఆలయాలు

ABOUT THE AUTHOR

...view details