పల్లె, పట్టణ హరితహారం అమలును పరిశీలించడానికి సీఎస్ సోమేశ్‌కుమార్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌తో కలిసి వికారాబాద్ జిల్లాలో పర్యటించారు. వికారాబాద్ మండలం పెండ్లిమడుగు, నవాబ్‌పేట మండలం దాతాపూర్ గ్రామాల్లోని హరితహారం నర్సరీలు, డంపింగ్ యార్డులను పరిశీలించారు.
క్షేత్రస్థాయిలో పల్లె ప్రగతిని పరిశీలించిన సీఎస్ - cs someshkumar visit at vikarabad and inspected harithaharam plants
క్షేత్రస్థాయిలో పల్లెప్రగతి కార్యక్రమం ఎలా జరుగుతోందో పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బృందం మూడు జిల్లాలను శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. అందులో భాగంగా శుక్రవారం సాయంత్రం వికారాబాద్‌కు హెలికాప్టర్లో వెళ్లారు.
![క్షేత్రస్థాయిలో పల్లె ప్రగతిని పరిశీలించిన సీఎస్ cs someshkumar visit at vikarabad and inspected harithaharam plants](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7497649-936-7497649-1591414317804.jpg)
క్షేత్రస్థాయిలో పల్లె ప్రగతిని పరిశీలించిన సీఎస్
గ్రామాల్లో ఏ పంటలు సాగు చేస్తున్నారని రైతులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాకు చేరుకున్నాకే వెళ్లే గ్రామాలను ఎంపిక చేసుకున్నట్లు సోమేశ్ కుమార్ తెలిపారు. సీఎం ప్రవేశపెట్టిన పల్లెప్రగతి వల్ల పల్లెల్లో మంచి మార్పు వచ్చిందని.. పారిశుద్ధ్య పనులు బాగా జరుగుతున్నాయని సీఎస్ వెల్లడించారు.