CPM: వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ గ్రామంలో సీపీఎం ఆందోళన చేపట్టింది. గ్రామ శివారులోనిలో సర్వేనెంబర్ 18లోని ప్రభుత్వ భూమిని ప్రైవేటు ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారంటూ నిరసన వ్యక్తం చేశారు. ఆ భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల కోసం అక్కడి పేదలు ఎవరికి తోచినట్లుగా వారు కర్రలు.. చీరలు కట్టి అక్కడే కూర్చున్నారు.
ఈ క్రమంలో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిగి తహసీల్దార్ నిరసనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అందుకు వారు నిరాకరించడంతో పోలీసులు వారిని బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉందని తీర్పు వచ్చాక తదుపరి విషయం చర్చిస్తామని తహాసీల్దార్ తెలిపారు.