తెలంగాణ

telangana

ETV Bharat / state

చిన్నపాటి విందుతో ముగ్గురు చిన్నారులకు కరోనా పాజిటివ్ - corona positive cases in vikarabad

వికారాబాద్ జిల్లాలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఈసారి పిల్లలు, వృద్ధులపై తన పంజా విసురుతోంది. తాజాగా ఇక్కడ ఐదుగురు కరోనా బారిన పడడంతో అధికారులు అప్పమత్తమయ్యారు. కుల్కచర్ల మండలం బండెల్కచర్లలో ఓ కుటుంబం నిర్వహించిన చిన్నపాటి విందుతో ముగ్గురు చిన్నారులకు వైరస్ అంటుకుంది.

covid-positive-for-three-children-in-vikarabad
చిన్నపాటి విందుతో ముగ్గురు చిన్నారులకు కరోనా పాజిటివ్

By

Published : May 27, 2020, 8:12 PM IST

షాద్​నగర్ నుంచి విందుకు హాజరైన ఓ వ్యక్తికి కరోనా వైరస్ బయటపడింది. ఈ విషయాన్ని గుర్తించిన అక్కడి వైద్యాధికారులు... వికారాబాద్ జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు అప్రమత్తమై... విందులో పాల్గొన్న 4 కుటుంబాల నుంచి 10 మంది నమూనాలు సేకరించారు. పరీక్షించగా కొడంగల్ మండలం గౌరారానికి చెందిన ఇద్దరు చిన్నారులకు వైరస్ సోకినట్లు గుర్తించారు. బండెల్కచర్ల గ్రామానికి చెందిన 60 ఏళ్ల మహిళ కూడా వైరస్ బారిన పడినట్లు స్పష్టం చేశారు.

తాండూరు పట్టణానికి చెందిన ఏడాది వయసున్న బాలుడికి వైరస్ సోకినట్లు తేల్చారు. ఆ బాలుడితోపాటు తల్లిని కూడా గాంధీ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన కుటుంబసభ్యులను బండెల్కచర్లలోని హోంక్వారంటైన్​లో ఉంచారు. ఆ గ్రామం మొత్తాన్ని స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా ఆదేశించారు. థారూర్ మండలం గట్టెపల్లిలో క్యాన్సర్​తో బాధపడుతున్న ఓ వ్యక్తి నగరంలోని ఆస్పత్రికి వెళ్లిరాగా కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించారు.

ఇవీ చూడండి:ఆన్​లైన్​ ప్రచారాన్ని జయప్రదం చేయాలి: ఉత్తమ్

ABOUT THE AUTHOR

...view details