తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజలకు భరోసా కల్పించడమే మా లక్ష్యం' - corden search at parigi

ప్రజలకు భరోసా కల్పించేందుకు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ పేర్కొన్నారు. నేర నియంత్రణకు కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

'ప్రజలకు భరోసా కల్పించడమే మా లక్ష్యం'

By

Published : Nov 22, 2019, 2:04 PM IST

వికారాబాద్ జిల్లా పరిగిలోని టీచర్స్ కాలనీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. కాలనీలోని ఇళ్లు, దుకాణాల్లో సోదాలు చేశారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చి కాలనీలో అద్దెకుంటున్న వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సరైన పత్రాలు లేని 22 బైకులు, 5 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలకు భరోసా కల్పించేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ నారాయణ పేర్కొన్నారు. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సోదాల్లో జిల్లా ఎస్పీ నారాయణతో పాటు పరిగి డీఎస్పీ, ఇద్దరు సీఐలు, పది మంది ఎస్సైలు, 70 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

'ప్రజలకు భరోసా కల్పించడమే మా లక్ష్యం'

ABOUT THE AUTHOR

...view details