తెలంగాణ

telangana

ETV Bharat / state

'స్వదేశానికి వచ్చేందుకు సహకరించండి' - 'Contribute to repatriation'

ఆర్థిక కష్టాల నుంచి గట్టేక్కాలని దుబాయ్​ బాట పట్టిన వికారాబాద్​కు చెందిన ఓ మహిళ పరదేశంలో అనుకోని కష్టాలు అనుభవిస్తోంది. యాజమానులు చిత్రహింసలు పెడుతున్నారని.. స్వదేశానికి వచ్చేందుకు సహకరించాలంటూ సామాజిక మాధ్యమాల ద్వారా వేడుకుంటోంది.

'స్వదేశానికి వచ్చేందుకు సహకరించండి'

By

Published : Jul 5, 2019, 4:37 AM IST

ఓ వైపు పేదరికం.. మరోవైపు కుమారుని ఆనారోగ్యం... ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు దుబాయ్​ వెళ్లింది వికారాబాద్​కు చెందిన సమీరా. అవసరానికి తగిన నగదు సంపాదించి కుమారుని ఆరోగ్యం బాగు చేసుకోవాలనుకొంది ఆ మాతృమూర్తి. అక్కడే అనుకోని కష్టం వచ్చింది. యాజమానుల చిత్ర హింసలు భరించలేక బయటకు వచ్చి... స్వదేశం వచ్చేందుకు ప్రయత్నిస్తోందామె.

'స్వదేశానికి వచ్చేందుకు సహకరించండి'

వికారాబాద్​ జిల్లా కులకచెర్ల మండలానికి చెందిన సమీరా... మూడేళ్ల క్రితం హైదరాబాద్​కు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. కుమారుడు జన్మించిన కొన్ని రోజులకే ఆమెను వదిలేసి వెళ్లిపోయాడాయన. అప్పటి నుంచి కష్టాలు పడుతూ వచ్చిందామె. చివరకు ఆర్థిక సుడిగుండం నుంచి బయటపడేందుకు దుబాయ్‌ వెళ్లడమే ఉత్తమమనుకుంది. తెలిసిన వాళ్ల ద్వారా దుబాయ్​ వెళ్లింది. అక్కడకు వెళ్లాక మరిన్న హింసలు అనుభవించింది. సమీరా పాస్​పోర్టు, విసా లాక్కున్న అక్కడి ఇంటి యాజమానులు ఇబ్బందులు పెట్టారు. చివరకు అక్కడ నుంచి ఎలాగోలాగ బయటపడి తెలిసిన వారి వద్ద తలదాచుకుంటోంది. భారతదేశానికి వచ్చేందుకు సహకరించాలని సామాజిక మాధ్యమాల ద్వారా అందరిని విజ్ఞప్తి చేస్తోంది.

సమీరాను స్వదేశానికి తీసుకువచ్చే స్తోమత లేదని... ప్రభుత్వమే చొరవ చూపాలని వేడుకుంటోంది ఆమె కుటుంబం.

ఇదీ చూడండి:క్రికెట్​లో జోక్యం చేసుకునేది లేదు: సుప్రీంకోర్టు

ABOUT THE AUTHOR

...view details