సీఎం కేసీఆర్ అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి ప్రసాద్ విమర్శించారు. వికారాబాద్లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ప్రసాద్ మద్దతు తెలిపారు. సమ్మెలో భాగంగా పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో కార్మికులు మానవహారం చేపట్టి ఆందోళన చేశారు. వికారాబాద్ డెవలప్మెంట్ ఫోరం, టీఆర్టీఎఫ్ తదితర సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వం మొండి వైఖరితో... కార్మికుల పోరాటాన్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి మండిపడ్డారు. ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా... కేసీఆర్ స్పందించకపోవటం దారుణమన్నారు.
'కార్మికుల పోరాటాన్ని అణగదొక్కాలని చూస్తున్నారు...' - 'కార్మికుల పోరాటాన్ని అణదొక్కాలని చూస్తున్నారు...'
ప్రభుత్వ మొండి వైఖరితో ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణగదొక్కాలని చూస్తోందని మాజీ మంత్రి ప్రసాద్ ఆరోపించారు. వికారాబాద్లో ఆర్టీసీ కార్మికుల 11వ రోజు సమ్మెలో భాగంగా మానవహారం నిర్మించి నిరసన తెలిపారు. ఉద్యోగులకు కాంగ్రెస్తో పాటు పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి.
CONGRESS SUPPORT FOR TSRTC SAMME IN VIKARABAD
TAGGED:
TSRTC STRIKE UPDATES