తెలంగాణ

telangana

ETV Bharat / state

'అవినీతి రహిత-అత్యుత్తమ మున్సిపాలిటీల ఏర్పాటే మా లక్ష్యం' - పరిగి తాజా వార్త

వికారాబాద్​ జిల్లా పరిగిలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్​ ఎన్నికల​ మేనిఫెస్టో విడుదల చేసింది.  ఆరేళ్ల తెరాస ప్రభుత్వం చేసిందేమీ లేదని ప్రజలను మాయమాటలతో మభ్యపెడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్​ రెడ్డి విమర్శించారు.

congress manifesto released in vikarabad
'అవినీతి రహిత-అత్యుత్తమ మున్సిపాలిటీల ఏర్పాటే మా లక్ష్యం'

By

Published : Jan 18, 2020, 11:58 AM IST

వికారాబాద్ జిల్లా పరిగిలో డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. కాంగ్రెస్​ పార్టీ గెలిస్తే మున్సిపాలిటీల్లో చేపట్టే పనుల గురించి వివరించారు. పరిగి మున్సిపాలిటీలో కౌన్సిలర్ అభ్యర్థుల కేటాయింపులో ఒక్క రెడ్డికి కూడా అవకాశం ఇవ్వకుండా రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచామని అన్నారు.

ఆరేళ్లలో ప్రభుత్వం చేసిందేమీ లేదని... కళ్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్న అసమర్థ ఎమ్మెల్యే వల్ల గతంలో శంకుస్థాపనలు చేసిన పనులు ఇంతకీ ప్రారంభించలేదన్నారు

అవినీతి రహిత-అత్యుత్తమ మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని రామ్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.

'అవినీతి రహిత-అత్యుత్తమ మున్సిపాలిటీల ఏర్పాటే మా లక్ష్యం'

ఇవీ చూడండి: తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు ఎంపిక?

ABOUT THE AUTHOR

...view details