వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి పంటలు పూర్తిగా పాడయ్యాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. పరిగి మండలంలోని జాఫర్ పల్లి, రాఘపూర్, మల్కాపూర్ గ్రామాల్లోని పొలాలను డీసీసీ అధ్యక్షులు టి రామ్మోహన్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ క్రిష్ణ సందర్శించారు.
'ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను ఆదుకోవాలి' - పరిగి వార్తలు
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో డీసీసీ అధ్యక్షులు టి.రామ్మోహన్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ క్రిష్ణ పర్యటించారు. వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
congress leaders visited in parigi mandal
గతంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉండి.. పంటలు పాడైతే వెంటనే పరిహారం అందించేదని రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఇప్పుడున్న ప్రభుత్వం రైతుల పట్ల మూర్ఖంగా వ్యవహారిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎకరాకు 20 నుంచి 30 వేల పరిహారం అందించాలని నాయకులు కోరారు.