వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎంపీ రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మద్దూర్ మండల కాంగ్రెస్ నాయకులు రేవంత్‌రెడ్డి నివాసం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
కందుల సొమ్ము కాజేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ వినతి - కందుల సొమ్ము కాజేసిన వారిని అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ ధర్నా
డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేశారు. అవినీతిగా అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మార్వోకు వినతిపత్రాన్ని సమర్పించారు.
డీసీఎంఎస్ ఆధ్వర్యంలో రూ. 73 లక్షల కోట్ల అవినీతి జరిగిందని.. ఇందులో ఎమ్మెల్యేకు సంబంధించిన అనుచరులు అక్రమాలను పాల్పడినట్లు తేలిందని.. వారిని ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కష్టపడి సాగు చేసుకున్న రైతులు విక్రయించుకునేందుకు ప్రభుత్వం మార్కెట్ ఏర్పాటు చేయగా.. అక్కడ రైతులను తొలగించి అధికార బలంతో వారి ఖాతాల్లో డబ్బులు వేసుకున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలని కోరుతూ స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.
ఇదీ చదవండిఃచేతివాటం... కందుల సొమ్ము కాజేశారు..