వికారాబాద్ మున్సిపల్ సాధారణ సమావేశాన్ని కాంగ్రెస్ కౌన్సిలర్లు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కింద వికారాబాద్ పురపాలక సంఘానికి మంజూరైన నిధుల బట్వాడలో తమకు అన్యాయం జరుగుతోందని నిరసన వ్యక్తం చేశారు. రూ.3 కోట్లకు పైగా నిధులు మంజూరు కాగా... అధికార పార్టీలోని జనరల్ వార్డులకు రూ.30 లక్షల వరకు కేటాయించారని కౌన్సిలర్లు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు ఎస్సీ వార్డులకు మూడు, ఐదు లక్షలు, ఎస్టీ వార్డుకు రూ.10 లక్షలు మాత్రమే మంజూరు చేసినట్లు తెలిపారు.
'నిధుల బట్వాడలో ఎస్సీ, ఎస్టీ వార్డులకు అన్యాయం జరుగుతోంది' - municipality funds
వికారాబాద్ మున్సిపాలిటీకి విడుదలైన నిధుల బట్వాడ విషయంలో అధికార పార్టీ వివక్ష చూపిస్తోందని కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. సాధారణ సమావేశాన్ని బహిష్కరించి మున్సిపాలిటీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్, ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు కౌన్సిలర్లు తెలిపారు.

'నిధుల బట్వాడలో ఎస్సీ, ఎస్టీ వార్డులకు అన్యాయం జరుగుతోంది'
నిధుల మంజూరు విషయంలో వివక్ష ఎందుకు చూపిస్తున్నారని మున్సిపల్ ఛైర్పర్సన్ మంజుల, ఎమ్మెల్యే ఆనంద్‌ను ప్రశ్నిస్తే బాధ్యాతరహిత సమాధానాలు చెబుతున్నారని వాపోయారు. ఈ విషయాన్ని కలెక్టర్, ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు కౌన్సిలర్లు తెలిపారు.