తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్ నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట - రైతులకు మద్దతుగా భారత్ బంద్

భారత్​ బంద్​కు వివిధ పార్టీల నుంచి మద్దతు లభించింది. దాదాపు అన్ని జిల్లాల్లో బంద్ కొనసాగుతోంది. వికారాబాద్​లో తెరాస, కాంగ్రెస్, వామపక్షాలు విడివిడిగా బంద్​లో పాల్గొన్నాయి. కాంగ్రెస్​ నేతలకు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది.

conflict between police and congress leaders in vikarabad
కాంగ్రెస్ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట

By

Published : Dec 8, 2020, 2:18 PM IST

రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్​ బంద్​లో భాగంగా వికారాబాద్​ జిల్లాలో తెరాస, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీలు విడివిడిగా ఆందోళనలు చేపట్టాయి. ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో ప్లైఓవర్​పై బైఠాయించారు. వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసన తెలిపారు.

కాంగ్రెస్ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట

రామ్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. మూడు గంటల వరకు బంద్​లో పాల్గొనాలని సీఎం చెప్పారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అందరినీ బంద్​లో పాల్గొనాలని పిలుపునిచ్చి... కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం విచారకరమని రామ్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:నూతన వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలి: మహమూద్ అలీ

ABOUT THE AUTHOR

...view details