వికారాబాద్ జిల్లా పరిగిలోని హైదరాబాద్ - బీజాపూర్ హైవేపై అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకులు రహదారి దిగ్బంధం చేశారు. కేంద్రం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల పిలుపుతో రాస్తారోకో నిర్వహించారు. దీంతో రహదారిపై గంటకుపైగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
జాతీయ రహదారిపై వామపక్ష నాయకుల ఆందోళన
కేంద్రం రైతు చట్టాలకు వ్యతిరేకంగా విపక్షాలు కదం తొక్కాయి. రైతు సంఘాల 'చక్కా జామ్' పిలుపుతో జాతీయ రహదారులను నిర్భంధించాయి. వికారాబాద్ జిల్లా పరిగి వద్ద కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకులు రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
వికారాబాద్లో ఆందోళన దిగిన వామపక్ష నాయకులు
జిల్లా కేంద్రమైన వికారాబాద్ ఎన్టీఆర్ కూడలిలో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. రైతులకు నష్టం కలిగించే చట్టాలను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.