తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్నికల సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించాలి: కలెక్టర్​ పౌసుమి - ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​పై ప్రత్యేక తరగతులు

పట్టభద్రుల ఎన్నికల పోలింగ్​ నిర్వహణకు సంబంధించి ఎన్నికల సిబ్బందికి వికారాబాద్​ జిల్లా కలెక్టర్​ పౌసుమి బసు ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. పీవో, ఏపీవోలు, సిబ్బంది వారివారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. సిబ్బందికి కేటాయించిన పోలింగ్​ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు.

mlc elections, vikarabad district collector
వికారాబాద్​ జిల్లా కలెక్టర్​, ఎమ్మెల్సీ ఎన్నికలు

By

Published : Mar 1, 2021, 12:24 PM IST

మార్చి14న జరగనున్న పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలపై వికారాబాద్​ జిల్లా కేంద్రంలోని డీపీఆర్​సీ కేంద్రంలో.. ఎన్నికల సిబ్బంది, పీవోలు, ఏపీవోలకు కలెక్టర్ పౌసుమి బసు అధ్యక్షతన శిక్షణా తరగతులు నిర్వహించారు. పోలింగ్​కు ఒక రోజు ముందు స్థానిక జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రం నుంచి పోలింగ్ సామగ్రిని సేకరించుకోవాలని కలెక్టర్​ సూచించారు. అవసరమైన పత్రాలు, సామగ్రి సరి చూసుకొని సిబ్బందికి కేటాయించిన పోలింగ్ కేంద్రానికి చేరుకొని అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రంలో విద్యుత్, సీసీ కెమెరాలు పరిశీలించుకోవాలని పేర్కొన్నారు.

పకడ్బందీగా ఏర్పాట్లు

పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు ఎలాంటి పోస్టర్లు, బ్యానర్లు, జన సమూహం ఉండకుండా చూసుకోవాలని కలెక్టర్​ వెల్లడించారు. ఎన్నికల రోజు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభించాలని, సాయంత్రం 4 లోపు క్యూలో నిల్చుని ఉన్న ఓటర్లందరికీ ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం కల్పించాలని వివరించారు. ప్రతి బ్యాలట్ పేపర్​పై పోలింగ్ అధికారి సంతకాలు చేయాలని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఎన్నికల శిక్షణా తరగతులకు హాజరు కాని సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్​ పౌసుమి పేర్కొన్నారు. పోలింగ్ సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ పత్రాలు ఫారం -12, 13ఏ, 13డీ లను కలెక్టర్​ అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోతిలాల్, డీఆర్​డీవో కృష్ణన్, వికారాబాద్ ఆర్డీవో ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'మన ఓటే.. మన భవిష్యత్​ను మార్చే ఆయుధం'

ABOUT THE AUTHOR

...view details