గ్రామకార్యదర్శుల సహకారంతో వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించిన ఆసరా పెన్షన్లను గ్రామాల్లో ఎప్పటికీ.. వంద శాతం పంపిణీ చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశమందిరంలో పోస్టల్ డిపార్ట్‌మెంట్, డీపీఎంలు, ఎస్పీఎంలతో ఆసరా పెన్షన్ల పంపిణీపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
100 శాతం పింఛన్ల పంపిణీ: కలెక్టర్ పౌసుమి బసు - Vikarabad District Collector latest news
వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశమందిరంలో ఆసరా పెన్షన్ల పంపిణీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వందశాతం పెన్షన్లు పంపిణీ చేయాలని కలెక్టర్ పౌసుమి బసు ఆదేశించారు.

వికారాబాద్ జిల్లాలో ప్రస్తుతం 90 శాతం పెన్షన్ల పంపిణీ జరుగుతుందని ఇక నుంచి 100 శాతం పంపిణీ సూచించారు. ఇప్పటి వరకు మృతి చెందిన పెన్షన్ దారుల పేర్లను జాబితా నుంచి వెంటనే తొలగించాలని తెలిపారు. బయోమెట్రిక్, ఆధార్, నెట్వర్క్ సమస్యలను అధిగమించి ప్రతి ఒక్కరికీ... ప్రతి నెల పెన్షన్లు అందే విధంగా చర్యలు చేపట్టాలని వెల్లడించారు. గ్రామాల్లోని గ్రామ కార్యదర్శుల సహకారంతో పంపిణీ కార్యక్రమం ప్రతి నెల పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక నుంచి ప్రతి నెల చివరి బుధవారం ఆసరా పెన్షన్ల పంపిణీపై సమాధానం సమీక్షా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.