తెలంగాణ

telangana

ETV Bharat / state

మట్టి వినాయకులపై విద్యార్థులకు కలెక్టర్​ అవగాహన - Collector awareness for students on clay vines

వికారాబాద్​ జిల్లా కొడంగల్​ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మట్టి వినాయకులపై అవగాహన కల్పించారు కలెక్టర్​ ఆయేష్​ మస్రత్​ ఖానం. పండగల వల్ల పర్యావరణ పాడుకాకుడదని సూచించారు.

Collector awareness for students on clay vines

By

Published : Aug 8, 2019, 7:06 PM IST

భక్తితో జరుపుకునే పండుగల వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా పాలనాధికారి ఆయేషా మస్రత్​ ఖానం సూచించారు. కొడంగల్​లోని బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మట్టి వినాయకులపై అవగాహన కల్పించారు. చుట్టూ ఉన్న పరిసరాలు మొత్తం కలుషితమైపోవటం వల్ల ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతున్నారన్నారు. వచ్చే వినాయక చవితిలో రసాయనాలతో చేసినవి కాకుండా మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతీ మొక్కను పసిపాపల్లా సంరక్షించాలన్నారు ఆయేషా.

మట్టి వినాయకులపై విద్యార్థులకు కలెక్టర్​ అవగాహన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details