CM Revanth Reddy Lifestyle :ఎనుముల రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు వంట చేయడం అంటే ఎంతో ఇష్టమట. ఆటలు, చిత్రాలు గీయడం వంటి హాబీలు ఉన్నాయి. కొంతకాలం ఓ పత్రికలో జర్నలిస్టుగా పని చేశారు. రేవంత్‌రెడ్డి గురించి తెలుసుకునేందుకు, ఆయన నివాసంలో ఉండే మాణిక్యమ్మ, ఆశప్ప, మల్లేశ్‌లను కదిలించగా, పలు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. వీళ్లు 14 సంవత్సరాలుగా ఇక్కడే సేవలు అందిస్తున్నారు. మరి వారు రేవంత్ రెడ్డి గురించి చెప్పిన ముచ్చట్లేంటో తెలుసుకుందామా?
CM Revanth Reddy Food Habits :రేవంత్‌రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. వనపర్తిలో కళాశాల స్థాయి విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడి ప్రింటింగ్ ప్రెస్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహించారు. 2009 ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక్కడే సొంతిల్లు నిర్మించుకున్నారు.
Revanth Reddy Biography and Real Life Story : రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో కల్వకుర్తిలో ఇంటిని నిర్మించుకున్నారు. ఏటా దసరా పండగ తర్వాతి రోజు కొడంగల్‌కు వచ్చి ప్రజలతో మాట్లాడటం ఆనవాయితీగా వస్తోంది. కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో కొడంగల్‌లోనే ఉన్నారు. అప్పుడు రేవంత్‌రెడ్డే కుటుంబ సభ్యులకు స్వయంగా వండిపెట్టారు.
పచ్చదనానికి ప్రాధాన్యం :ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చదనానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. ఇందులో భాగంగానే కొడంగల్‌లోని ఇంటి ప్రాంగణంలో పచ్చికతో కూడిన గార్డెన్ ఏర్పాటు చేశారు. చుట్టూరా ఎత్తైన ప్రహరీ నిర్మించి రకరకాల పూల మొక్కలు, చెట్లను పెంచారు. పిత సెలోబియం అర్బోరియం (కోజబా అర్బోరియా) మొక్కను రేవంత్‌రెడ్డి స్వయంగా నాటారు. అనంతరం ఆ చెట్టు చుట్టూ గద్దె కట్టించారు. అక్కడే కార్యకర్తలతో ఆయన సమావేశమవుతారు. 300 మంది వరకు కూర్చునే వీలుంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు, కొడంగల్ నియోజకవర్గ బాధ్యుడు తిరుపతిరెడ్డికి కుక్కలంటే ఇష్టం. కొడంగల్ నివాసంలో, హైదరాబాద్‌లోని నివాసంలో వాటిని పెంచుతున్నారు. అందులో బెల్జియం మిల్‌నైస్ జాతికి చెందిన శునకం ప్రస్తుతం కొడంగల్‌లో ఉంది.
తెల్లవారుజాము నుంచే :ముఖ్యమంత్రిరేవంత్‌రెడ్డికిరోజు ఉదయం 4 గంటలకే నిద్రలేవడం అలవాటు. ఆయన గోరువెచ్చని నీటిని తీసుకుంటారు. ఆ తర్వాత దినచర్యలో భాగంగా 30 నిమిషాల పాటు వ్యాయామం చేస్తారు. పుచ్చకాయ లేదా యాపిల్ జ్యూస్ ( Revanth Reddy Food Habits) తప్పనిసరిగా తీసుకుంటారు. అనంతరం పేపర్ చదివి కాసేపటికి టీ తాగుతారు. ఆ తర్వాత ముఖ్యమైన వారికి రేవంత్‌రెడ్డి ఫోన్‌లు చేస్తారు.