భారత పౌరులు రాజ్యాంగానికి లోబడి... రాజ్యాంగబద్ధంగా జీవించాలని వికారాబాద్ జిల్లా అదనపు న్యాయమూర్తి జస్టిస్ మురళీమోహన్ తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్లో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డా. అంబేడ్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
'పౌరులు రాజ్యాంగానికి లోబడి జీవించాలి' - వికారాబాద్ జిల్లా అదనపు న్యాయమూర్తి తాజా వార్తలు
భారత పౌరులు రాజ్యాంగానికి లోబడి జీవించాలని వికారాబాద్ జిల్లా అదనపు న్యాయమూర్తి జస్టిస్ మురళీమోహన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
పౌరులు రాజ్యాంగానికి లోబడి జీవించాలి: మురళీమోహన్
రాజ్యాంగం మనకు హక్కులు, బాధ్యతలు కల్పించిందని మురళీమోహన్ పేర్కొన్నారు. హక్కులను కోల్పోతే బానిసలుగా మారతామని... బాధ్యతలను విస్మరిస్తే అన్యాయాలు పెరుగుతాయన్నారు. నేటి పౌరులు రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆనంద్, జిల్లా పాలనాధికారి అయేషా, ఎస్పీ నారాయణ, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రోజుల రాజులు - తక్కువ కాలం పదవిలో ఉన్న ముఖ్యమంత్రులు