వికారాబాద్ జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీకి తన సొంత నిధులతో టీవీ అందజేయనున్నామని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి తెలిపారు. దాదాపు ఒక్కొక్క టీవీ ఖరీదు రూ. పది వేల చొప్పున ఆ మొత్తం నిధుల చెక్కును హైదరాబాద్ ప్రగతి భవన్‌లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.
కరోనా నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు చదువుకు దూరమైన దృష్ట్యా... ప్రభుత్వం "ఆన్ లైన్"లో తరగతులు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని ఎంపీ తెలిపారు. ఇంట్లో టీవీ లేని కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు ఆటంకం ఉండకూడదనే ఉద్దేశ్యంతో టీవీలను అందజేస్తున్నట్లు వెల్లడించారు.