వికారాబాద్ జిల్లా పరిగి నియోజవర్గంలోని గ్రామ పంచాయతీలకు ఎంపీ రంజిత్ రెడ్డి తన సొంత ఖర్చుతో టీవీ లను పంపిణీ చేశారు. ఇంట్లో టీవీ లేని కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో టీవీలను అందజేసినట్లు చెప్పారు.
ప్రతిఒక్క విద్యార్థికి విద్య అందాలి: ఎంపీ రంజిత్‌రెడ్డి - chevella mp ranjeeth reddy latest news
టీవీ లేని విద్యార్థులు ఆన్లైన్ తరగతులకు దూరం కాకుండా ఎంపీ రంజిత్ రెడ్డి గ్రామ పంచాయతీలకు టీవీలు అందజేశారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలకు స్థానిక ఎమ్మెల్యే మహేశ్ రెడ్డితో కలిసి టీవీలు పంపిణీ చేశారు.
గ్రామ పంచాయతీలకు టీవీలు అందజేసిన ఎంపీ
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టీవీల ద్వారా పాఠాలు చెబుతున్నారని... విద్యార్థులు ఆన్లైన్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి, తెరాస నేతలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో లక్షన్నర దాటిన కరోనా కేసులు... 927 మంది మృతి