వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. గతంలో ఆడపిల్లల పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు అప్పు చేసేవారని, ఆ అప్పు తీర్చడానికి నానా ఇబ్బందులు పడేవారని ఎమ్మెల్యే అన్నారు. 45 మంది లబ్దిదారులకు చెక్కులను అందజేశామన్నారు. అనంతరం రైతులకు పట్టా పాస్‌బుక్కులను అందజేశారు.
చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పట్నం - MLA Patnam Narender Reddy distributes checks to beneficiaries of Kalyanalakshmi and Shaadi Mubarak
తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు చెక్కులను అందజేశారు.
చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పట్నం
రైతులు ఆకస్మికంగా మరణిస్తే రైతు బీమా ద్వారా కుటుంబానికి 5 లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప దేశముఖ్, తహశీల్దార్ కిరణ్ కుమార్, ఇతర నాయకులు మధు యాదవ్, వివిధ గ్రామల ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : కమ్ముకున్న మంచు దుప్పటి