తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటమి భయంతోనే తెరాస కొత్త వ్యక్తిని బరిలో దింపింది: కిషన్‌రెడ్డి - telangana varthalu

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపాదే విజయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే తెరాస కొత్త వ్యక్తిని బరిలోకి దింపిందని ఆయన అన్నారు.

ఓటమి భయంతోనే తెరాస కొత్తవ్యక్తిని బరిలో దింపింది: కిషన్‌రెడ్డి
ఓటమి భయంతోనే తెరాస కొత్తవ్యక్తిని బరిలో దింపింది: కిషన్‌రెడ్డి

By

Published : Mar 7, 2021, 9:21 PM IST

ఇరిగేషన్ ప్రాజెక్టులు ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఏటీఎంలుగా మారాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. వికారాబాద్​లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపాదే విజయమని కిషన్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. విద్యావంతులు, మేధావులు భాజపా వైపే ఉన్నారని అన్నారు.

ఉద్యోగులు, కళాకారుల్లో తెరాసపై వ్యతిరేకత ఉందని కిషన్​ రెడ్డి పేర్కొన్నారు. ఓటమి భయంతోనే తెరాస కొత్త వ్యక్తిని బరిలోకి దింపిందన్నారు. పీవీ కూతురుకు పదవే ఇవ్వాలనుకుంటే రాజ్యసభకు పంపొచ్చు కదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను తెరాస డబ్బుతో గెలవాలనుకుంటోందని ఆరోపించారు. దేశంలో సచివాలయం లేని రాష్ట్రం తెలంగాణేనని... సచివాలయానికి రాని ముఖ్యమంత్రి కేసీఆరేనని విమర్శించారు. భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్​ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు.

ఓటమి భయంతోనే తెరాస కొత్తవ్యక్తిని బరిలో దింపింది: కిషన్‌రెడ్డి

ఇదీ చదవండి: కేంద్రం సహాయం లేకుండా ఒక్క పథకం కూడా చేపట్టలేదు: కిషన్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details