తెలంగాణ

telangana

ETV Bharat / state

'సెల్​ టవర్​ నిర్మాణ పనులు వెంటనే ఆపాలి' - సెల్​ టవర్​ నిర్మాణ పనులపై స్థానికుల ఆందోళన

వికారాబాద్​ జిల్లా పరిగిలో ఇళ్ల మధ్య నిర్మిస్తున్న సెల్ టవర్ పనులు వెంటనే ఆపాలని స్థానికులు డిమాండ్ చేశారు. టవర్​ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కలెక్టరేట్​ ముందు ధర్నాకు దిగారు. 9వ వార్డులో జరుగుతున్న​ నిర్మాణ పనులను అడ్డుకోవాలని అధికారులను కోరుతున్నారు.

Cell tower construction work should be stopped immediately demand at parigi  in vikarabad district
'సెల్​ టవర్​ నిర్మాణ పనులు వెంటనే ఆపాలి'

By

Published : Mar 23, 2021, 8:05 PM IST

జనవాసాల మధ్య సెల్ టవర్​ నిర్మాణాన్ని ఆపాలని వికారాబాద్​ జిల్లా పరిగి పట్ణణ వాసులు డిమాండ్ చేస్తున్నారు. టవర్​ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కలెక్టరేట్​ ఎదుట ఆందోళన చేపట్టారు. పట్టణంలోని 9వ వార్డులో జరుగుతున్న టవర్​ నిర్మాణాన్ని అడ్డుకోవాలని అధికారులను కోరారు. మున్సిపల్ కమిషనర్​కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు.

సెల్ టవర్ రేడియేషన్​​ వల్ల పిల్లలు, వయసుపైబడినవారి ఆరోగ్యం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమ గోడు విని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ సిబ్బందికి వినతిపత్రం సమర్పించారు. టవర్ పనులు ఆపకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఎప్పుడు?: నామ

ABOUT THE AUTHOR

...view details