దళిత వర్గాల ప్రజలు వెనబాటుతనాన్ని చదువుతోనే అధిగమించలరని ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబల్ నాయక్ పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంఆర్పీ చౌరస్తా నుంచి అంబేడ్కర్ భవన్ వరకు సాంప్రదాయ నృత్యాలతో ర్యాలీగా వచ్చారు. వారి ఆచారాల ప్రకారం నివాళ్లర్పించారు. మహనీయులు అందరి వారని.... వారిని కొందరికి మాత్రమే పరిమితం చేయడం మంచిది కాదని రాంబల్ నాయక్ అన్నారు.
ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు - ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంపాల్ నాయక్
గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ నృత్యాలతో ర్యాలీ తీశారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు
సంత్ సేవాలాల్ ప్రకృతిని ప్రేమించేవారని... అందుకే గిరిజనులందరూ హరితహారంలో పాల్గొనాలని కలెక్టర్ పౌసుమి బసు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆనంద్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.