తెలంగాణ

telangana

ETV Bharat / state

దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు - తాండూర్

అర్ధరాత్రి చోరీ చేస్తే ఎవరు చూడరనుకున్నాడు. ఆలయంలోకి చొరబడి హుండీని ధ్వంసం చేశాడు. నగదు, కానుకలు ఎత్తుకెళ్తూ చివరి నిమిషంలో గ్రామస్తులకు దొరికిపోయాడు. ఇంతకీ దొంగతనం ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా? అయితే ఓ లుక్కేయండి.

Ccatch the thief in temple robbery
దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు

By

Published : Sep 30, 2020, 1:46 PM IST

వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం కొట్లాపూర్ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో మంగళవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. అదే గ్రామానికి చెందిన భద్రాద్రి ... అర్ధరాత్రి ఆలయం గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. అమ్మవారి గర్భగుడి ముందు ఉన్న హుండీని పగలగొట్టాడు. వెంటనే అందులో ఉన్న నగదు, కానుకలను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించాడు.

అతను ఆలయం నుంచి వస్తుండగా గమనించిన కొందరు గ్రామస్తులు అనుమానంతో అతన్ని పట్టుకున్నారు. దొంగతనం చేసిన అమ్మవారి నగదు, కానుకలతో సహా అతన్ని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:కదులుతున్న కంటైనర్లే టార్గెట్.. రెక్కీ చేస్తే పనైపోయినట్టే!

ABOUT THE AUTHOR

...view details