తెలంగాణ

telangana

ETV Bharat / state

డ్రగ్స్​ మత్తులో కారుతో యువకుల హల్​చల్... ఎస్సైకి తీవ్ర గాయాలు - కారుతో హల్​చల్​ చేసిన యువకులు... ఎస్సైకి తీవ్ర గాయాలు

CAR ACCIDENT TO NAVABPET SI KIRAN
CAR ACCIDENT TO NAVABPET SI KIRAN

By

Published : Jan 2, 2020, 9:15 AM IST

Updated : Jan 2, 2020, 10:47 AM IST

09:06 January 02

కారుతో హల్​చల్​ చేసిన యువకులు... ఎస్సైకి తీవ్ర గాయాలు

డ్రగ్స్​ మత్తులో కారులో యువకుల హల్​చల్... ఎస్సైకి తీవ్ర గాయాలు

    వికారాబాద్​ జిల్లా అనంతగిరిలో నలుగురు యువకులు డ్రగ్స్​ మత్తులో కారుతో హల్​చల్​ చేశారు. అర్ధరాత్రిపూట వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో... యువకుల కారును పోలీసులు ఆపారు. మత్తులో ఊగిపోతున్న యువకులు పోలీసుల నుంచి తప్పించుకోబోయి వారి మీదికే పోనిచ్చారు. ఈ ఘటనలో నవాబుపేట ఎస్సై కృష్ణ తీవ్రగాయాలపాలయ్యారు. ఆయనను వెంటనే కిమ్స్​ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై కృష్ణ కాలు విరిగినట్లు వైద్యులు తెలిపారు.

            కారును అదుపులోకి తీసుకుని యువకులను విచారించారు. నలుగురు యువకులు టోలిచౌకికి చెందిన ఇమ్రాన్​, అన్వర్​, నవీద్​, సమీర్​లుగా  గుర్తించారు. న్యూఇయర్​ సందర్భంగా పార్టీ చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. యువకులను వైద్య పరీక్షలు నిర్వహించగా... నలుగురు డ్రగ్స్​ తీసుకున్నట్లు గుర్తించామని వెల్లడించారు. కారులో 12 సిగరెట్​ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి: 'నేను సీఎం అవుతాననే చర్చే అవసరం లేదు"

Last Updated : Jan 2, 2020, 10:47 AM IST

ABOUT THE AUTHOR

...view details