తెలంగాణ

telangana

ETV Bharat / state

కాగ్నా నది ఉద్ధృతం.. భారీగా ట్రాఫిక్ జామ్ - huge traffic zam at kagna river news today

వికారాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు,వాగులు పొంగిపొర్లుతున్నాయి. తాండూర్ కాగ్నా నది వరద నీటితో ఉప్పొంగుతుంది. నదిపై రోడ్డు వంతెన తెగిపోగా తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.

కాగ్నా నది ఉద్ధృతం.. భారీగా ట్రాఫిక్ జామ్
కాగ్నా నది ఉద్ధృతం.. భారీగా ట్రాఫిక్ జామ్

By

Published : Sep 20, 2020, 10:25 AM IST

Updated : Sep 20, 2020, 4:56 PM IST

వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వరద ఉద్ధృతికి తాత్కాలిక వంతెన మళ్ళీ తెగిపోయే ముప్పును గుర్తించిన అధికారులు అప్రమత్తమయ్యారు. వరద నీటిలో కొట్టుకు వస్తున్న వ్యర్థాలు, చెట్లు తదితర వస్తువులు వంతెన కింద పైపుల్లో ఇరుక్కుని వరద నీరు సాఫీగా వెళ్లేందుకు చర్యలు తీసుకున్నారు.

జేసీబీ యంత్రంతో..

యాలాల ఎంపీపీ బాలేశ్వర గుప్త ఆధ్వర్యంలో అధికారులు జేసీబీ యంత్రంతో వరద నీటిలో కొట్టుకు వచ్చే వ్యర్థాలను తొలగించారు. ఇదే క్రమంలో వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. ఫలితంగా మహబూబ్​నగర్- కొడంగల్ నుంచి తాండూర్ మీదుగా కర్ణాటక చించోలి వెళ్లే వాహనాలను ఎక్కడికక్కడ నిలిపేశారు. వంతెనకు రెండు వైపులా వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి.

అప్పటిదాకా వాహనాలను అనుమతించలేదు..

నదిలో కొట్టుకు వచ్చే వ్యర్ధాలను తొలగించేవరకు పోలీసులు వాహనాలను వంతెనపైకి అనుమతించలేదు. వ్యర్ధాలను తొలగించిన తర్వాత వాహనాలను అనుమతించడంతో వంతెనపై ఒక్కసారిగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. స్పందించిన పోలీసులు వాహనాలను వరుస క్రమంలో వెళ్లేందుకు చర్యలు చేపట్టారు.

కాగ్నా నది ఉద్ధృతం.. భారీగా ట్రాఫిక్ జామ్

ఇవీ చూడండి : జగిత్యాలలో నిషేధిత గుట్కా పట్టివేత

Last Updated : Sep 20, 2020, 4:56 PM IST

ABOUT THE AUTHOR

...view details