తెలంగాణ

telangana

ETV Bharat / state

రెవెన్యూ చట్టం ఆమోదంపై జిల్లా వ్యాప్తంగా సంబురాలు - రెవెన్యూ చట్టం ఆమోదంపై వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా సంబురాలు

బలవంతుల నుంచి బలహీనుల భూములను కాపాడటానికే ముఖ్యమంత్రి కేసీఆర్​ రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ సంబురాలు చేసుకుని ఎడ్లబండితో ర్యాలీ నిర్వహించారు.

celebration in vikarabad by mla metuku aanand
రెవెన్యూ చట్టం ఆమోదంపై జిల్లా వ్యాప్తంగా సంబురాలు

By

Published : Sep 12, 2020, 2:59 PM IST

అసెంబ్లీలో రెవెన్యూ చట్టం అమోదం పొందగా వికారాబాద్​ జిల్లాలో సంబురాలు అంబరాన్నంటాయి. ఎడ్లబండ్లపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుచి ఎంఆర్పీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. దారి పొడుగునా టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు.

కేసీఆర్​ తెచ్చిన రెవెన్యూ చట్టంతో ప్రజల ఆనందంగా ఉన్నారని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. బలవంతుల దౌర్జన్యానికి చరమగీతం పాడేందుకే సీఎం ఈ చట్టాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో శివారెడ్డి సొసైటీ ఛైర్మన్ ముత్యంరెడ్డి, టౌన్​ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్​రెడ్డి, మార్కెట్​ కమిటీ అధ్యక్షుడు విజయ్​, మున్సిపల్​ ఛైర్​పర్సన్​ మంజుల తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్​ వ్యూహరచన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details