BRS President KCR Participate BRS Public Meeting at Kodangal : ఈ కొడంగల్ ఇంత పొడవు ఉందని.. నా మీద కామారెడ్డిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీకి వచ్చారని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ కోసం మేం కొట్లాడుతుంటే రేవంత్‌రెడ్డి ఆంధ్రోళ్ల పంచన ఉన్నారని మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని.. ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డిలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడా రావని.. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాడని.. ఆయన మాటలు ఎవరూ నమ్మవద్దని సీఎం కేసీఆర్ సభికులకు సూచించారు. రేవంత్‌కు నీతి, పద్ధతి, నిజాయతీ లేదని.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు అసలు వ్యవసాయం గురించి తెలియదు.. వాళ్లు రైతుబంధు, విద్యుత్ గురించి మాట్లాడతారని విమర్శించారు.
BRS Praja Ashirvada Sabha at kodangal : ఎన్నికలో గెలిచిన వెంటనే ధరణిని తీసేసి భూమాత తెస్తామని కాంగ్రెస్ అంటున్నారని... ధరణి తీసేస్తే రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రైతుబంధు ఇచ్చి ప్రజల సొమ్ము వృథా చేస్తున్నానని ఆ పార్టీ నేతలు అంటున్నారని అలాంటి వారికి అధికారం ఇస్తారా అని ఓటర్లను ఆయన ప్రశ్నించారు.
రైతుబంధు వంటి సంక్షేమ పథకాలు, రైతుల జీవితాల్లో వెలుగులు నింపాయి : కేసీఆర్
'రేవంత్‌రెడ్డి పెద్ద భూకబ్జాదారు. ఆయన ఎప్పుడైనా వ్యవసాయం చేశారా? రేవంత్‌రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమీ పని చేయలేదు. తెలంగాణ కోసం మేం కొట్లాడితే ఆయన ఆంధ్రోళ్లతో చేరి మాపై తుపాకీలు ఎక్కు పెట్టారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రూ.50 లక్షలతో దొరికిన వ్యక్తి రేవంత్‌రెడ్డి. రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే గబ్బు. రేవంత్ టికెట్లు అమ్ముకున్నారని కాంగ్రెస్ నేతలే అంటున్నారు, అలాంటి వ్యక్తిని మళ్లీ గెలిపించుకుంటారా'నని కేసీఆర్ ప్రశ్నించారు.
"రైతుల బాధలు ఏందో నాకు తెలుసు. రేవంత్‌రెడ్డి దున్నాడా ఏనాడైనా వ్యవసాయం చేశాడా. రేవంత్‌రెడ్డి పెద్ద భూకబ్జాదారుడు. ఎక్కడిపడితే అక్కడ భూములు కబ్జా పెడతాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తారంట. ధరణి స్థానంలో భూమాత పెడతారంట.. అది భూమాతన భూమేతన. ఈ తొమ్మిదేళ్లలో కొడంగల్ నియోజకవర్గానికి రేవంత్‌రెడ్డి ఏమీ చేయలేదు. కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారు.. టికెట్ల కోసం డబ్బులు తీసుకున్నాడని. రేవంత్‌రెడ్డి నోరు తెరిస్తే గబ్బు."- కేసీఆర్, బీఆర్‌ఎస్ అధినేత
CM KCR Public Meeting at Kodangal : ఓటు కొనుగోలు చేస్తూ దొరికినా.. రేవంత్ అది నా మెడల్ అంటున్నారని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. నీతి నియమం లేని వ్యక్తి రేవంత్ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తే.. కాంగ్రెస్ 3 గంటల విద్యుత్ సరిపోతుందని అంటున్నారని అన్నారు. రైతుబంధు పేరుతో రైతులకు కేసీఆర్ బిచ్చమెస్తున్నాడని ఆనాడు రేవంత్‌రెడ్డి అన్నారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో పట్నం నరేంద్రరెడ్డిని గెలిపిస్తే.. మీ నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.
ఈ కొడంగల్ ఇంత పొడవు ఉందని, నా మీద కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ కాంగ్రెస్ వస్తే తెచ్చేది భూమాతనా? భూ‘మేత’నా? : కేసీఆర్
ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి బతుకులు తప్ప ఏం లేవు: కేసీఆర్