వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం నాగసమందర్ పరిధిలోని కోటపల్లి ప్రాజెక్టు అలుగు పారడం వల్ల నాగసమందర్, పెద్దెముల్ మండలం మంచన్ పల్లి కల్వర్టు తెగిపోయింది. దీంతో తాండూరు నుంచి హైదరాబాద్‌కు రాకాపోకలు నిలచిపోయాయి. కొడంగల్, పరిగి మీదుగా వారి మళ్లించారు.
తెగిన వంతెనలు.. రాకపోకలకు ఇబ్బందులు
వికారాబాద్ జిల్లా కోటపల్లి ప్రాజెక్టు అలుగు పారడం వల్ల నాగసమందర్, పెద్దెముల్ మండలం మంచన్ పల్లి కల్వర్టు తెగిపోయింది. దీంతో తాండూరు నుంచి హైదరాబాద్‌కు రాకాపోకలు నిలచిపోయాయి. కొడంగల్, పరిగి మీదుగా వారి మళ్లించారు.
2016లో కురిసిన వర్షాలకు జిల్లాలోని నాగసమందర్, మంచన్‌పల్లి, తాండూరు కాగ్నా నదిపై ఉన్న మంబాపూర్ వంతెనలు తెగిపోయాయి. అప్పుడు వంతెనలకు తాత్కాలిక మరమ్మతులు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. తాండూరు వద్ద కాగ్నా నదిపై మాత్రమే కొత్త వంతెన నిర్మించారు. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు పడడం వల్ల ఆగస్టు నెలలో మంబాపూర్, మంచన్‌పల్లి, నాగసమందర్ వంతెనలు తెగిపోయాయి. వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అధికారులను కోరడం వల్ల తాత్కాలికంగా మరమ్మతులు చేశారు.
ఇదీ చదవండి:నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణాలు