వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామంలో ఏడేళ్ల బాలుడు మిషన్ భగీరథ పైప్లైన్ గుంతలో పడి మృతి చెందాడు. గ్రామానికి చెందిన వడ్డే వెంకటమ్మ, అనంతయ్యల ఏకైక కుమారుడు ప్రకాష్. ఉపాధి నిమిత్తం వెంకటమ్మ, అనంతయ్యలు హైదరాబాద్లో ఉంటారు.
మిషన్ భగీరథ పైపులైన్ గుంతలో పడి బాలుడు మృతి
వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మిషన్ భగీరథ పైప్లైన్ కోసం తవ్విన గుంతలో పడి చంద్రశేఖర్ అనే ఏడు సంవత్సరాల బాలుడు మృతి చెందాడు.
మిషన్ భగీరథ పైపులైన్ గుంతలో పడి బాలుడు మృతి
ప్రకాష్ నానమ్మ దగ్గర ఉంటూ చదువుకుంటున్నాడు. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు మిషన్ భగీరథ పైప్లైన్ కోసం తవ్విన గుంతలో పడ్డాడు. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలో నీళ్లు ఉండడం వల్ల మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు.
ఇదీ చదవండి:వారికి స్మార్ట్ఫోన్లే లేవ్- మరి ఆన్లైన్లో చదువెలా?