తెలంగాణ

telangana

ETV Bharat / state

'మూసీ సుందరీకరణ కాదు.. శుద్ధీకరణ జరగాలి' - musi river in hyderabad

హైదరాబాద్​లో పరిశ్రమల వ్యర్థాలతో మూసీ నది కలుషితం అవుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మూసీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

bjp state president laxman owes to clean musi river
భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

By

Published : Dec 14, 2019, 3:50 PM IST

భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

నమామీ మూసీ పేరుతో మూసీ ప్రక్షాళన ఉద్యమాన్ని ప్రారంభించామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ అన్నారు. వికారాబాద్​ జిల్లా అనంతగిరి మూసీ నది వద్ద ప్రత్యేక పూజలు చేశారు.

అనంతగిరి పద్మనాభ స్వామి గుడి నుంచి భాజపా సంకల్పం తీసుకుందని లక్ష్మణ్​ తెలిపారు. మూసీ ప్రక్షాళన విషయంలో మోదీని ఆదర్శంగా తీసుకుంటామని వెల్లడించారు. ఈనెల 16న హైదరాబాద్​ బాపూఘాట్​లో ప్రతిజ్ఞ తీసుకుని, 17న సూర్యాపేటలో కలుషితమైన మూసీని పరిశీలిస్తామని లక్ష్మణ్​ చెప్పారు.

పరిశ్రమలో వ్యర్థాలతోనే మూసీ కలుషితం అవుతోందని లక్ష్మణ్​ పేర్కొన్నారు. మూసీ సుందరీకరణ కాదు.. శుద్ధీకరణ జరగాలని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details