వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టి.. గోల్కొండ కోటపై కమలం జెండా ఎగురవేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. హామీల అమలులో తెరాస సర్కార్ వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు.
చావు అంటే భయం లేదు: బండి సంజయ్ - భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వార్తలు
'చావు అంటే భయం లేదు.. చావే నన్ను చూసి భయపడుతుంది' అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వికారాబాద్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. 2023 ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టి గోల్కొండ కోటపై కమలం జెండా ఎగురవేస్తామన్నారు.
చావు అంటే భయం లేదు: బండి సంజయ్
హిందువుగా నిరూపించుకునేందుకు డీఎన్ఏ పరీక్షకు నాగార్జునసాగర్ వేదికగా సిద్ధమేనని బండి సవాల్ విసిరారు. చావు అంటే భయం లేదని.. చావే తనను చూసి భయపడుతుందన్నారు. భాజపా బహిరంగ సభలో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహరాల బాధ్యుడు తరుణ్ చుగ్, సీనియర్ నేత లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు.