వికారాబాద్ జిల్లా తాండూరులో పురపాలక ఎన్నికల ప్రచారంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. కేంద్రం నుంచి నిధులు రావటం లేదని కేసీఆర్, కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
'కేంద్రం నిధులపై తెరాసవి తప్పుడు ప్రచారాలు' - gosha mahal mla raja singh
రాష్ట్రంలో 8 లక్షల రెండు పడకల ఇళ్లు నిర్మిస్తామన్న.. సీఎం కేసీఆర్ హామీ ఇప్పటికీ నెరవేర్చలేక పోయారని భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. తాండూరులో జరిగిన పార్టీ సభలో తెరాసపై విరుచుకుపడ్డారు.
'కేంద్రం నిధులపై తెరాసవి తప్పుడు ప్రచారాలు'
తెరాస పాలనలో అవినీతి పెరిగిపోయిందని రాజా సింగ్ ఆరోపించారు. దేశంలో పోటీ పెడితే అబద్ధాలు చెప్పడంలో తండ్రీకొడుకులు బహుమతులు సాధిస్తారని ఎద్దేవా చేశారు. ప్రచార సభలో జల్లా నాయకులు, మున్సిపల్ అభ్యర్థులు పాల్గొన్నారు.
- ఇవీ చూడండి: తెరాసకు సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల మద్దతు