వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో భాజపా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఇచ్చిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనేందుకు యత్నించిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్ మండిపడ్డారు.
కులకచర్లలో భాజపా నాయకుల ముందస్తు అరెస్ట్ - అసెంబ్లీ ముట్టడి వార్తలు
వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో భాజపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనేందుకు యత్నించిన పలువురు నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
![కులకచర్లలో భాజపా నాయకుల ముందస్తు అరెస్ట్ bjp leaders arrested in kulakacherla](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9159550-684-9159550-1602581915167.jpg)
bjp leaders arrested in kulakacherla
తెరాస ప్రభుత్వం 131 జీవోను రద్దు చేసి ప్రజలకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కరోనా కారణంగా 8 నెలల నుంచి తినడానికి తిండి లేక నానా తంటాలు పడుతున్న ప్రజలను ఎల్ఆర్ఎస్ పేరుతో దోచుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సౌమ్య, మండల ప్రధాన కార్యదర్శి చంద్రలింగం తదితరులు పాల్గొన్నారు.