తెలంగాణ

telangana

ETV Bharat / state

తాండూరులో బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న ప్రజాప్రతినిధులు - batukamma celebrations in Vikarabad

బతుకమ్మ వేడుకలు వికారాబాద్​ జిల్లా తాండూరులో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జడ్పీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, తాండూరు పురపాలక సంఘం అధ్యక్షురాలు తాటికొండ స్వప్న, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.

batukamma celebrations in tandoor
తాండూరులో బతుకమ్మ వేడుకలు

By

Published : Oct 24, 2020, 10:09 AM IST

వికారాబాద్ జిల్లా తాండూరులో బతుకమ్మ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. పట్టణ ప్రజాప్రతినిధులు.. మహిళలతో కలిసి ఆడిపాడారు. బతుకమ్మ వేడుకలతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు, యువతులు, చిన్నారులు, బతుకమ్మ ఆటపాటలతో కోలాహలం చేశారు.

తాండూరులో బతుకమ్మ వేడుకలు

తెలంగాణ చరిత్రకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తోందని జడ్పీ ఛైర్​పర్సన్​ సునీతా రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం అధ్యక్షురాలు తాటికొండ స్వప్న, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details