వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలో ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగలేదన్నారు.
'బతుకమ్మ చీరల తయారీతో నేతన్నలకు ఉపాధి'
రాష్ట్రంలో బతుకమ్మ చీరల తయారీతో చేనేతలకు ఉపాధి లభిస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలో మహిళలకు దసరా కానుకగా బతుకమ్మ చీరలను ఆయన పంపిణీ చేశారు.
'బతుకమ్మ చీరల తయారీతో నేతన్నలకు ఉపాధి'
బతుకమ్మ చీరల తయారీతో నేతన్నలకు ఉపాధి లభిస్తుందన్నారు.ఈ ఏడాది 287 డిజైన్లతో చేనేతలు చీరలు తయారుచేశారని తెలిపారు. దసరాతో పాటు క్రిస్‌మస్, రంజాన్‌లకు చీరల పంపిణీ చేపడుతామని ఎమ్మెల్యే వెల్లడించారు.