భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి అర్బన్, గ్రామీణ జిల్లాల మీదుగా వికారాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది. ఎనిమిదవ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నేడు వికారాబాద్ సమీపంలోని డెంటల్ కళశాల నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.
వికారాబాద్ టౌన్, బాబు జగ్జీవన్‌రావు విగ్రహాం మీదగా మందాన్ పల్లి వరకు 13 కిలో మీటర్ల మేర సాగనుంది. మధ్యాహ్నాం వికారాబాద్ పట్టణంలో జరిగే సభకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడణవీస్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించనున్నారు. రాత్రి మందాన్ పల్లిలో బస చేయనున్నారు.