పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు న్యాయవాదులను హత్యచేసినా... ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ హత్యలను హైకోర్టు సుమోటోగా తీసుకుందని, గవర్నర్ తమిళిసై ఖండించారన్నారు.
న్యాయవాద దంపతుల హత్యలపై సీఎం స్పందించరేం: బండి - తెలంగాణ తాజా వార్తలు
పెద్దపల్లి జిల్లాలో జరిగిన న్యాయవాద దంపతుల హత్యలపై గవర్నర్, హైకోర్టు స్పందించినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. వికారాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదుల నిరసన దీక్షకు సంజయ్ మద్దతు తెలిపారు.
న్యాయవాద దంపతుల హత్యలపై సీఎం స్పందించరేం: బండి
వికారాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదుల నిరసన దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. వామనరావు దంపతుల హత్యలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని న్యాయవాదులకు రక్షణ కల్పించాలన్నారు. నిరసన దీక్షలకు కేసీఆర్ దిగిరారని.. ఆందోళనలను ఉద్ధృతం చేయాల్సిన అవసరం ఉందని న్యాయవాదులకు సూచించారు.