ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో 'గాంధీ మార్గం-అనుసరణీయం' అనే అంశంపై వికారాబాద్ జిల్లా తాండూర్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో ఆర్యవైశ్య యువజన సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం గాంధీ చూపిన సమాజ సేవలో మనమూ అడుగులు వేయాలని కోరారు. గాంధీ ఆశయ సాధనకు ప్రతిఒక్కరు కృషి చేయాలని సూచించారు. మహాత్మా చూపిన అహింస, నీతి, నిజాయితీ మార్గాల్లో యువత పయనించాలని తెలిపారు.
నేటి యువత.. గాంధీ బాటలో పయనించాలి' - తాండూర్లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి
జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని తాండూర్లో ఆర్యవైశ్య యువజన సంఘం, ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
తాండూర్లో గాంధీ జయంతి అవగాహన సదస్సు
TAGGED:
యువత అహింస, నీతి పెంచుకోవాలి