వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఓ హత్య సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 14న పుట్ట వెంకటేశ్ తన మిత్రులతో కలిసి మద్యం తాగుతున్నాడు. అంతలోనే ఏడవడం ప్రారంభించాడు...ఏమైందిరా అని వారు అడగగా.. నాకు రాఖీ కట్టే వారు ఎవరున్నారు రా.. ఉన్న ఒక్క చెల్లెను బావ చంపేశాడు కదా అని బదులిచ్చాడు. అంతలోనే వారంత ఓ నిర్ణయానికి వచ్చి...అతని బావ సత్యనారాయణ వద్దకు వెళ్లారు. బావ మందు తాగిపియ్యవా..అని అడిగాడు వెంకటేశ్ ..సరే అన్నాడు ఆయన. ఇద్దరు కలిసి ఓ చోట తాగడం ప్రారంభించారు. అనంతరం సిగరెట్ల కోసం ఓ దుకాణానికి వెళ్లారు. అక్కడ బావతో గొడవ పెట్టుకుని మిత్రులతో కలసి చితకబాదాడు. సరిగ్గా ఆ సమయంలోనే వచ్చాడు సత్యనారాయణ మేన బావ వచ్చి ఆ గొడవను ఆపి అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించాడు. ఆటోలో వారు వెళుతున్నారు... మార్గమధ్యంలోనే ఆపేసి అతని ప్రాణాలు పోయేదాకా కొట్టారని...సీఐ శ్రీనివాస్ రావు వెల్లడించారు.
వికారాబాద్ హత్య కేసు నిందితుల అరెస్టు
తెల్లవారితే రాఖీ పండుగ...నలుగురు మిత్రులు కలిసి మద్యం తాగుతున్నారు. అందులో ఒకరు ఏడువ సాగారు..ఏమైందిరా అలా ఏడుస్తున్నావు అన్నారు అందులో ఒకరు..రాఖీ కట్టేవారు నాకెవరున్నారురా... ఉన్న ఒక్క చెల్లెను బావ చంపాడు కదా..అన్నాడు ఆ వ్యక్తి. అంతలోనే వారంత కలసి ఓ నిర్ణయానికి వచ్చారు. మూకమ్ముడిగా దాడి చేసి అతని బావను చంపేశారు.
వికారాబాద్ హత్య కేసు నిందితుల అరెస్టు